8 నిమిషాల ఎపిసోడ్ కోసం రూ.50 కోట్ల రూపాయలు ??

SMTV Desk 2018-09-28 12:00:29  Sye Raa Narasimha reddy. Climax scene, Ram charan,

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.ఇండియా నుంచి 160 మంది బృందం జార్జియా వెళ్ళింది. అక్కడ 600 మంది లోకల్ నటులను ఈ సినిమా కోసం వినియోగించుకుంటున్నారు. విశాలమైన ఖాళీ ప్రదేశంలో సెట్స్ వేసి షూట్ చేస్తున్నారట. 40 రోజులపాటు పోరాటానికి సంబంధించిన షూట్ జరగబోతున్నది. ఈ షూట్ మొత్తం కేవలం 8 నిమిషాల ఎపిసోడ్ కోసమేనట. జార్జియా షూట్ కోసం నిర్మాత రామ్ చరణ్ దాదాపుగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే కేవలం 8 నిమిషాల ఎపిసోడ్ కోసం రూ.50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నమాట. ఇంతటి భారీ ఖర్చుతో షూట్ చేస్తున్న ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇది వరకే రిలీజైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.