ప్రభాస్ ఫ్యాన్స్ కు అసలు సిసలు గిఫ్ట్

SMTV Desk 2018-09-28 11:23:09  Prabhas, Saaho, Saaho teaser, Saaho first look, Prabhas Birthday

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చేస్తున్న మూవీ సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. దుబాయ్ లో భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ లో సాహో షూటింగ్ జరుగుతుందని సమాచారం. బాహుబలి-2 రిలీజ్ టైంలో ఏదో శాంపిల్ గా ఇట్స్ షో టైం అంటూ ఫ్యాన్స్ ను హుశారెత్తించగా ప్రభాస్ ఫ్యాన్స్ కు అసలు సిసలు గిఫ్ట్ ఇచ్చే సమయం దగ్గరపడుతుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహోకి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారట. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, హింది భాషల్లో కూడా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాతో పాటుగా జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో మరో సినిమాకు బర్త్ డే నాడే ముహుర్తం పెట్టబోతున్నాడట ప్రభాస్. చూస్తుంటే 2019 ప్రభాస్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషి చేసేలా కనిపిస్తున్నాడు.