లక్కీ ఛాన్స్ పట్టేసిన నభా నటేష్

SMTV Desk 2018-09-22 17:11:01  Nabha Natesh,raviteja,

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుధీర్ బాబు హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆర్.ఎస్ నాయుడు డైరక్షన్ లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన సినిమా నన్ను దోచుకుందువటే. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నభా నటేష్ అప్పుడే రెండో ఛాన్స్ అందుకుంది. సినిమాలో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరిని అలరించిన నభా నటేష్ మాస్ మహరాజ్ రవితేజ సరసన ఛాన్స్ పట్టేసింది. రాం తాళ్లూరి నిర్మాణంలో రవితేజ విఐ ఆనంద్ డైరక్షన్ లో ఓ సినిమా రానుంది. ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా ఓకే చేశారు. సుధీర్ తర్వాత ఆ వెంటనే రవితేజతో అంటే నభా లక్ బాగుందని చెప్పొచ్చు.