ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా కోర్టు దేశాలు పాటించాల్సిందే

SMTV Desk 2018-09-21 15:54:16  CM Chandra Babu Naidu, maharastra court

తెలంగాణ ఎన్నికల్లో అంతో ఇంతో లబ్ధి చేకూరుస్తుందని ఆశిస్తున్న బాబ్లీ కేసు వారంటు టీడీపీ అధినేత చంద్రబాబుకు నాయుడికి చుక్కెదురైంది. కేసు సాగదీతపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబు వేసిన రీకాల్ పిటిషన్‌ను ఈరోజు కొట్టేసింది. ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా కోర్టు దేశాలు పాటించాల్సిందేనని, బాబు తమ ముందుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. చంద్రబాబు, ఇతర 16 మంది నిందితులు వచ్చే నెల 15న కోర్టుకు హాజరు కావాల్సిందేనని జడ్జి ఆదేశించారు. బాబు తరఫున హాజరైన న్యాయవాది సుబ్బారావు వేసిన రీకాల్ పిటిషన్‌లో పసలేదంటూ కోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో వారంట్ అందుకున్న నాటి తెలంగాణ టీడీపీ నేతలు ప్రకాష్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంలకు కోర్టు బెయిలు మంజూరు చేసి, రూ. 5 వేల చొప్పున జరిమానా వేసింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కేసులో బాబుకు, ఇతర నేతలకు నోటీసులు, వారంటులు రావడం తెలిసిందే.