ట్రిపుల్ ఆర్ కోసం రచయిత సాయి మాధవ్

SMTV Desk 2018-09-21 10:53:02  Sai madhav writer, baahubali, rrr,

బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్ మూవీ నుండి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. మెగా నందమూరి మల్టీస్టారర్ గా రాం చరణ్, ఎన్.టి.ఆర్ లతో కలిసి ఈ మెగా మూవీ ప్లాన్ చేశారు. బాహుబలి తర్వాత పర్ఫెక్ట్ మూవీ ఎంచుకున్న జక్కన్న ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రముఖ రచయిత సాయి మాధవ్ ను సెలెక్ట్ చేశాడట రాజమౌళి. తన పెన్ పవర్ తో సత్తా చాటుతున్న సాయి మాధవ్ ట్రిపుల్ ఆర్ కు పనిచేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు. క్రిష్ పరిచయం చేసిన సాయి మాధవ్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్, సైరా సినిమాలకు మాటలను అందిస్తున్నాడు. రాజమౌళి కూడా అతని ప్రతిభ మెచ్చి ట్రిపుల్ ఆర్ లో అతన్ని చేర్చుకున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది.