అఖిల్ ప్లేబాయ్ అవతారం

SMTV Desk 2018-09-19 18:43:54  Akhil, Mr Majnu, akhil akkineni,

అక్కినేని అఖిల్ 3వ సినిమాగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వతున్న సినిమా టైటిల్ గా ఇన్నాళ్లు ప్రచారంలో ఉన్న మిస్టర్ మజ్ ను అనే పెట్టేశారు. కింగ్ నాగార్జున దాసరి డైరక్షన్ లో మజ్ను సినిమా చేశారు. నాని హీరోగా కూడా మరో మజ్ను వచ్చింది. అయితే అఖిల్ కూడా మరోసారి మజ్నుగా కనిపిస్తున్నాడు. తొలిప్రేమ తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక కొద్ది నిమిషాల క్రితం ఈ సినిమా టీజర్ రిలీజైంది. మిస్టర్ మజ్ను గా అఖిల్ అదరగొట్టాడు. ముందు రెండు సినిమాల కన్నా అఖిల్ లుక్స్ పరంగా జోష్ పరంగా మిస్టర్ మజ్నులో బాగున్నాయని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ యూత్ ను అలరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. 2019 జనవరి 26న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మిస్టర్ మజ్ను ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.