కొంపముంచిన ట్వీట్.....

SMTV Desk 2018-09-19 14:25:47  santhosh shivan tweet on producers, chennai , khushboo

చెన్నై: నచ్చిన వ్యక్తులకి గుడి కట్టి పూజించే తమిళులు తేడా వస్తే అదే స్థాయిలో ఆగ్రహిస్తారు, తాజాగా జరిగిన ఒక సంఘటన ఆ విషయాన్నీ స్పష్టం చేస్తున్నది. తమిళం లో మంచి గుర్తింపు ఉన్న సినిమాటోగ్రాఫర్ లలో ఒకరు సంతోష్ శివన్, అయితే ఈయన ట్విట్టర్ ద్వారా చేసిన ఒక పోస్టు సంతోష్ జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చింది. ఇటీవల నిర్మాతలను ఉద్దేశించి పెట్టిన ఒక పోస్టు పై తమిళ నిర్మాతల మండలి మండిపడింది. ఒక కుక్క కోపంగా మరియు సౌమ్యంగా ఉన్న రెండు ఫోటోలను పెట్టి నిర్మాతలు సాంకేతిక నిపుణులకు పారితోషకం ఇస్తున్న సమయం లో ఒకలా కథానాయికలకు పారితోషకం ఇచ్చేటపుడు ఒకలా ప్రవర్తిస్తారని అర్థం వచ్చేలా పెట్టిన పోస్టు నిర్మాతల దృష్టికి వెళ్ళింది దీంతో తమిళ నిర్మాతలకు కోపం కట్టలు తెంచుకుంది, దీనికి పరిణామంగా సంతోష్ శివన్ బాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కొంత మంది మాత్రం మొదటి తప్పుగా భావించి వదిలివేయాలని కోరుతున్నట్టుగా సమాచారం. గతం లో ఖుష్బూ లాంటి తారల విషయం లో కూడా ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.