తాళి బొట్లు తీయించిన ఘటన పై మండిపడ్డ గవర్నర్

SMTV Desk 2018-09-18 14:49:03  VRO exam, Governor,

హైదరాబాద్: ఇటీవల మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లోని పరీక్షా కేంద్రంలో లో జరిగిన వీఆర్ఓ పరీక్ష కేంద్రాల్లో గృహిణుల చేత తాళి బొట్లు తీయించిన ఘటన దుమారం రేపింది. ఈ విషయం పై అభ్యర్థుల కుటుంభం సభ్యులు నిరసనలు తెలియ జేశారు. తాజాగా గవర్నర్ నర్సింహన్ ఈ ఉదంతం పై ఆగ్రహం వ్యక్తం చేసారు, ఘటనకు కారకులైన వారు తనకు వెంటనే వివరణ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఈ విషయం పై స్పందించిన టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ ఒక రిపోర్టును గవర్నరు కార్యాలయానికి పంపినట్టు తెలుస్తుంది "ఈ ఘటనకు మేము బాద్యులం కాదు మేము ఈ విదంగా చేయమని చెప్పలేదు పరీక్ష కేంద్రాల నిర్వాహకులే దీనికి బాధ్యత వహించాలి, ఇప్పటికే ఆ కేంద్రాలను బ్లాక్ లిస్టు లో ఉంచాం " అని ఈ రిపోర్టు సారాంశం గా వినికిడి.