తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

SMTV Desk 2018-09-18 11:04:18  Telugu States, Rain hits Telugu States,

విజయనగరం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 18 న అల్ప పీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, ఆ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తున ఉపరిత ఆవర్తనం ఏర్పడటంతో ఆ ప్రాంతం నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, అలాగే శ్రీకాకుళం, విశాఖ పట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.