కింగ్ నాగార్జున తో మారుతి చేస్తారా?

SMTV Desk 2018-09-17 18:32:40  King Nagarjuna, Maruthi, Shailaja reddy alludu

ఈరోజుల్లో సినిమా నుండి లేటెస్ట్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు వరకు మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. ఆడియెన్స్ నాడి తెలిసిన దర్శకుడిగా మారుతికి మంచి క్రేజ్ ఉంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు మారుతి. సినిమా టాక్, రివ్యూస్ ఎలా ఉన్నా కలక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి. ఇక ఇదే మళ్లీ అక్కినేని కాంపౌండ్ లో అతను మరో సినిమా చేసే అవకాశాన్ని తెచ్చి పెట్టిందట. శైలజా రెడ్ది అల్లుడు సినిమాతో చైతు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందించిన మారుతికి కింగ్ నాగార్జున లక్కీ ఛాన్స్ ఇచ్చాడట. ఆల్రెడీ మారుతి డైరక్షన్ లో వెంకటేష్ బాబు బంగారం చేశాడు. శైలజా రెడ్డి రిజల్ట్ ను బట్టి మారుతి సినిమా కన్ఫాం చేద్దామని అనుకున్న నాగ్ ఫైనల్ గా మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనికి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది.