ఆడితేనే ఉంటారు...

SMTV Desk 2018-09-17 15:05:28  BCCI, MSK Prasad, Rishab Pant

టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌‌కే ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ జట్టులో ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిని పక్కనబెట్టడానికి ఇక వెనుకాడబోమని ఆయన హెచ్చిరించారుజాతీయ జట్టుకు ఆడేందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకపోతే... దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న యువ ఆటగాళ్లపై దృష్టి సారించాల్సి వస్తుందని చెప్పాడు. ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ తనకు సంతృప్తిని కలిగించిందని తెలిపాడు. రిషబ్ బ్యాటింగ్ పై తనకు ఎప్పుడూ, ఎలాంటి అనుమానం లేదని... అయితే, అతని కీపింగ్ నైపుణ్యాలు మరింత మెరుగు పడాల్సి ఉందని చెప్పాడు.ఆసియాకప్‌లో కోహ్లికి విశ్రాంతి ఇచ్చినట్లే.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తామని.. అద్భుతంగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్‌కు త్వరలోనే అవకాశం వస్తుందని ప్రసాద్ పేర్కొన్నారు.