"అధికారం నిలబేట్టుకునేందుకే కేసిఆర్ తాపత్రయం"

SMTV Desk 2017-05-30 15:37:58  janareddy,kcr,shabber ali,ponguleti sudhakar

హైదరాబాద్, మే 30 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారం నిలబేట్టుకునేందుకే తాపత్రయ పడుతున్నారని. ప్రజాసమస్యలు గాలి కొదిలేసి సర్వేలు, ఎన్నికలు అంటూ హడావుడి సృష్టిస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు కె.జానారెడ్డి విమర్శించారు. సర్వేల పేరిట ప్రజలను పక్కదారి పట్టించడమే ధ్యేయంగా జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారని..ఇది ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యమేనని విరుచుక పడ్డారు. శాసన సభ ఆవరణలో శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్నారు. అమెరికాలో హిల్లరి క్లింటన్ గెలుస్తారని సర్వేలన్నీ వెల్లడిస్తే అనూహ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచారని గుర్తుచేశారు. అమెరికాలో ట్రంప్ లాగానే 2019 లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని , ఇక్కడ కాంగ్రెస్ పార్టీయో ట్రంప్ అని..వ్యక్తులు కాదని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసమై పోరాడి ఆదర్శంగా నిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాంగ్రెస్‌ ధ్యేయ మని, 2019 ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ను ప్రజలే అధికారం లోకి తెస్తారన్న విశ్వాసముందని, మాకు సర్వే లపై కన్నా ప్రజలపై విశ్వాసం ఉంది. సీఎం చేయించుకున్న సర్వే ఫలితాలు హాస్యాస్ప దంగా ఉన్నాయి. అందులో వాస్తవాలేమిటో, ఎలాంటి సర్వేనో ప్రజలే తేలుస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.