కాంగ్రెస్ లో చేరనున్న సినీ నిర్మాత

SMTV Desk 2018-09-14 10:51:40  Bandla ganesh, congress, Delhi, Rahul gandhi, Uttamkumar reddy, telanngana elections

ఢిల్లీ : సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో నేడు ఆ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్బంగా టీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ తో చర్చించి అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో పార్టీ పరంగా వివిధ కార్యకలాపాలు నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ తన కార్యకలాపాలు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలపై ఉత్తమ్‌ ఆరా తీసి, సీనియర్లతో కలిసి చర్చించిన తరువాత జాబితా కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది.