నగరంలో భారీగా ట్రాఫిక్ జాం

SMTV Desk 2018-09-13 11:09:40  Hyderabad, Traffic jam, Vinayaka chaviti, LB nagar, Koti, Hyderabad, Vijayawada,

హైదరాబాద్: వినాయక చవితి సందర్బంగా విగ్రహాలు, ఇతరత్రా సామగ్రి తీసుకెళ్లడానికి వందలాది వాహనాలు ఒక్కసారిగ రోడ్డు మీదకు వచ్చాయి . దీంతో నగరంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎల్బీనగర్ నుంచి కోటి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రి 3 గంటల నుంచి వాహనాల తాకిడి ఎక్కువ కావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, మలక్‌పేట్, చాదర్‌‌ఘాట్, కోఠి తదితర ప్రాంతాల్లో వందలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.