తొలి జాబితా సిద్దం చేసిన బీజేపీ

SMTV Desk 2018-09-12 16:20:02  K. Laxman, BJP, Telangana, Amit sha BJP National presedent, Telangana elections

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్దులను ప్రకటించే ప్రయత్నంలో ఉన్నాయి . ముందుగానే 105 మంది అభ్యర్దులను ప్రకటించి ప్రచారంలో తెరాస దూసుకేల్తుంటే అదే దారిలో విపక్షాలు కూడా సిద్దమవుతున్నాయి. ఈ నేపద్యంలో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల జాబితాను టీ-బీజేపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 20 వ తేదీ లోగా లిస్టు విడుదల చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఎవరితో పొత్తు లేకుండానే అధికారం లోకి వస్తామని తొలి నుంచీ చెబుతున్న బీజేపీ.. తొలి జాబితాలో 30-35 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్ సిట్టింగ్ స్థానాలు: ముషీరాబాద్ - కె.లక్ష్మణ్ అంబర్ పేట్ - జి.కిషన్ రెడ్డి ఉప్పల్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఖైరతాబాద్ - సీహెచ్ రామచంద్రారెడ్డి గోషామహల్ - రాజాసింగ్ మిగతా చోట్ల ఖరారైన పేర్లు ఈ విధంగా ఉన్నాయి. మల్కాజ్ గిరి - ఎన్.రాంచంద్రారావు సికింద్రాబాద్ - సతీశ్ గౌడ్ కూకట్ పల్లి - మాధవరం కాంతారావు మహబూబ్ నగర్ - జి.పద్మజారెడ్డి మునుగోడు - జి.మనోహర్ రెడ్డి సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వరరావు మహేశ్వరం - సుధాకర శర్మ పరిగి - ప్రహ్లాద్ మిగితా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన నేపధ్యంలో మొదటి లిస్టు ఆయన చేతుల మీదుగా ప్రకటించాలని భావిస్తున్నారు.