హైదరాబాద్ లో భారీ వర్షం

SMTV Desk 2018-09-11 18:37:15  Hyderabad, Heavyrain in Hyderabad

హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, మోతీనగర్, రాజీవ్ నగర్, బోరబండ, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కోఠి, మెహిదీపట్నం, సైదాబాద్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్ నిలిచిపోయింది.