కింగ్ నాగార్జున @బిగ్ బాస్

SMTV Desk 2018-09-11 15:11:20  King Nagarjuna, Bigg Boss, Nani

నాని హోస్ట్ గా స్టార్ మా ప్రెస్టిజియస్ గా ప్రెజెంట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. మొదటి సీజన్ కన్నా ఈ సీజన్ ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిందని చెప్పొచ్చు. ఇక సీజన్ ముంగింపుకు దగ్గర పడుతున్న ఈ తరుణంలో షోని మరింత ఆసక్తి రేపేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఫైనల్స్ కు గెస్ట్ గా కింగ్ నాగార్జున రాబోతున్నాడని తెలుస్తుంది. అసలైతే మొదటి సీజన్ చేసిన ఎన్.టి.ఆర్ ను స్పెషల్ గెస్ట్ కింద పిలుద్దామని అనుకోగా తండ్రి మరణంతో ఎన్.టి.ఆర్ పిలిచినా వచ్చే అవకాశం లేదు. ఆల్రెడీ నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేశాడు కాబట్టి నాగ్ ను గెస్ట్ గా పిలిచి ఫైనల్స్ లో సర్ ప్రైజ్ చేయబోతున్నాడట. అంతేకాకుండా సెప్టెంబర్ 27న నాగార్జున, నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్ ప్రమోషన్స్ కూడా బిగ్ బాస్ వేదిక కానుందని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ 2 ఫైనల్స్ లో ఈ దేవదాస్ లు చేసే హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి.