పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గించిన చంద్రబాబు

SMTV Desk 2018-09-10 16:57:13  CM Chandrababu naidu, Telagudesham,

* ఖజానాపై రూ.1,120 కోట్ల భారం * కేంద్రం కూడా పన్నులు తగ్గించాలని విజ్ఞప్తి అమరావతి: రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలపై ఆర్థిక భారం భారీగా పడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,120 కోట్ల భారం పడనుండి. తగ్గించిన ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. పెట్రోల్ బాదుడుకు నిరసనగా ఈ రోజు ప్రతిపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,120 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చంద్రబాబు కోరారు. క్రూడాయిల్ ధరలు పెరిగినందున తాము కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నామని అంటున్న మోడీ మాటల్లో నిజం లేదని అన్నారు. గతంలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించ లేదని గుర్తు చేసారు.