తెరాస కు గుడ్ బై చెప్పనున్న దానం నాగేందర్ ?

SMTV Desk 2018-09-10 12:44:29  TRS Rebals , Telangana, Dhanam Nagendhar, Congress T PCC Chif Uttamkumar Reddy, Congress

* పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో రహస్య భేటీ ? హైదరాబాద్: తెరాస లో అస్సమ్మతి సెగ మొదలైంది. టికెట్ రాని నాయకులు ఒక్కక్కొరుగా బయటికి వెళ్తున్నారు. తాజాగా టికెట్ ఆశించి టీఆర్ఎస్ పార్టీలో కెల్లిన దానం నాగేందర్ మళ్లి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమైన దానం... కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, టీఆర్ఎస్ తాజాగా కొంగరకలాన్‌ను నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సిటీ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తల తరలింపునకు కృషిచేసారు.