వదంతులు నమ్మొద్దు : సొనాలీ బింద్రే భర్త

SMTV Desk 2018-09-10 10:52:04  Sonali Bindre, Cancer, tweet,

ప్రముఖ నటి సొనాలీ బింద్రే కొంతకాలంగా హైగ్రేడ్‌ మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌ కదమ్‌ అనే బీజేపీ నేత ఒకరు సొనాలీ గురించి ట్వీట్‌ చేస్తూ..ఆమె చనిపోయినట్లు తెలిసిందని ఇందుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని..తనకు వచ్చిన సమాచారం తప్పని, సొనాలీ త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ విషయమై తాజాగా గోల్డీ ట్వీట్‌ చేశారు. ‘సామాజిక మాధ్యమాలను బాధ్యతతో వినియోగించండి. నా భార్య గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని వేడుకుంటున్నాను. దీని వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సొనాలీ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురించి సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు.