బాలీవుడ్‌ నటి కి మెరిల్‌ స్ట్రీప్‌ అవార్డు

SMTV Desk 2018-09-09 19:52:50  Aishwarya Rai, Meril Strip Award, Bollywood actress

బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచర సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించిన విఫ్ట్‌(వుమెన్‌ ఇన్‌ ఫిలింస్‌ అండ్‌ టిలివిజన్‌) అవార్డ్స్‌లో భాగంగా ఐష్‌కు మెరిల్‌ స్ట్రీప్‌ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక సెలబ్రిటీ ఐశ్వర్య రాయే కావడం విశేషం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఐష్‌ తన తల్లి బృందా రాయ్‌, కుమార్తె ఆరాధ్యతో కలిసి వెళ్లారు. ఈ వేడుకలో అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఎమిరాల్డ్‌ అవార్డు అందుకున్నారు. అలనాటి హాలీవుడ్‌ నటి మెరిల్‌ స్ట్రీప్‌ పేరిట ఈ అవార్డును ప్రవేశపెట్టారు. ఇటీవల ‘ఫ్యాన్నే ఖాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్య .. త్వరలో తన భర్త అభిషేక్‌తో కలిసి ‘గులాబ్‌ జామున్‌’ అనే సినిమాలో నటించబోతున్నారు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.