షాక్‌లో బిగ్ బాస్ టీం

SMTV Desk 2018-09-09 14:32:13  Bigg Boss, Kaushal Army 2k run,

అభిమానం సంపాదించ‌డం ఆషామాషి విష‌యం కాదు. అందుకోసం గొప్ప గొప్ప త్యాగాలు చేయాలి . కాని ఎలాంటి త్యాగం చేయ‌కుండా కేవ‌లం త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఎన్నో వేల మంది అభిమానుల‌ని సంపాదించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశ‌ల్‌. బిగ్ బాస్ ఇంట్లోకి రాక ముందు ఆయ‌న కొంద‌రికి మాత్ర‌మే సుప‌రిచితం. కాని ఇప్పుడు ఆయ‌న పేరుతో అభిమాన సంఘాలు ఏర్ప‌డ్డాయి. కౌశ‌ల్ ఆర్మీ పేరుతో ఏర్ప‌డిన అభిమాన సంఘం బిగ్ బాస్ గేమ్‌లో ఆయ‌న‌కి ఫుల్ స‌పోర్టింగ్‌గా ఉంటుంది ఒక కంటెంస్టెంట్‌‌కి సపోర్ట్‌గా నిలుస్తూ.. బలనిరూపణకు హైదరాబాద్ వేదికగా 2కె వాక్‌ నిర్వహించారు కౌశల్ అభిమానులు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్-2 టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎపిసోడ్ ప్రారంభం నుంచి ఆయనకు అనుకూలంగా ప్రత్యర్థి కంటెస్టెంట్స్‌కు వ్యతిరేకంగా వరుస పోస్ట్‌లు కుప్పలుతెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లోని సభ్యులంతా కౌశల్‌ని టార్గెట్ చేయడం.. ఒంటరిని చేసి గ్రూపులు కట్టడంతో కౌశల్‌కు అండగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు బాగా పెరిగిపోయింది. చివరకు బిగ్‌బాస్ షోను శాసించే స్థాయికి ఈ కౌశల్ ఆర్మీ పెరిగిపోయింది. హైదరాబాద్‌లో నిర్వహించిన 2కె వాక్‌కు స్థానిక అభిమానులు ఈ రేంజ్‌లో హాజరైతే… రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్‌లో ఎవ్వరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు కౌశల్. కౌశల్ ఎఫెక్ట్‌తో.. కిరీటి, భాను శ్రీ, బాబు గోగినేని, దీప్తి సునయన, తేజశ్వి, గణేష్, నందిని ఇలా వరుసగా ఎలిమినేషన్‌కి వెళ్లారంటే కౌశల్‌తో గొడవ పెట్టుకోవడమే ప్రధాన కారణం అని ఆయన ఫ్యాన్స్ భావన. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనం ఇస్తున్నాయి. ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు.