కేసీఆర్‌ దమ్ముంటే ఓయూకు వెళ్ళు

SMTV Desk 2018-09-08 18:07:04  T TDP Leader, L Ramana, AP CM Chandrababunaidu, HYDERABAD, Telangana Elections

* తెలుగుదేశం ఆంధ్ర పార్టీ కాదు అందరి పార్టీ. * టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ . రమణ హైదరాబాద్: తెలుగుదేశం ఆంధ్ర పార్టీ కాదు అందరి పార్టీ అని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ . రమణ అన్నారు. రానున్న ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో టీ టీడీపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రమణ మాట్లాడుతూ దమ్ముంటే కేసీఆర్‌ ఒక్కరే ఓయూకు వెళ్లాలని అప్పుడు ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై విరోచిత పోరాటం చేశామని తెలిపారు. అన్ని స్థాయిల్లో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొడంగల్‌ నుంచి కోదాడ వరకు టీడీపీకి బలం ఉందని, టీడీపీ ఆంధ్రా పార్టీ అని కేసీఆర్‌ అంటున్నారని, అదేపార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యావన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ ఆంధ్రుల పార్టీ కాదని, అందరి పార్టీ అని రమణ స్పష్టం చేశారు. ఎలాంటి కారణం లేకుండానే అసెంబ్లీని రద్దు చేశారని, టీఆర్‌ఎస్‌ను కూకటివేళ్ళతో పెకిలించడానికి.. అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తామని స్పష్టం చేశారు. తెరాసపై పోరాడే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. టీడీపీ అంటే పేదల పార్టీ అని, వారి అభివృద్ధికి అన్ని విధాల కార్యక్రమాలు చేస్తామన్నారు.