వదిన సమంత కోసం మరది అఖిల్ స్టెప్పులేసి శభాష్ అనిపించాడు. సమంత నటించిన ‘ యూటర్న్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అనిరుద్ స్వరపరచిన ‘ కర్మథీమ్ ‘ అనే స్పెషల్ సాంగ్ ఇటీవల రిలీజయింది. ఈ పాటలో ఆమె స్టెప్పులను అనుకరిస్తూ చిన్నారులు కూడా డ్యాన్సులు చేసి వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి..అఖిల్ ఊరుకుంటాడా ? వదిన మాదిరే తానూ డ్యాన్స్ చేసి.. ‘ ఈ వీడియోను మా వదిన కోసం ‘ అనే కామెంట్‌తో పోస్ట్ పెట్టాడు. పైగా సమంతకు అడ్వాన్స్ విషెస్ కూడా చెప్పాడు. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ యూటర్న్ ‘ చిత్రం ఈ నెల 13 న విడుదల కానుంది.