ఎన్ని స్థానాల్లో పోటీ చేద్దాం

SMTV Desk 2018-09-08 15:11:23  T TDP Leaders, Meeting, AP CM Chandrababu naidu, TDP,Telangana election

* టీ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం హైదరాబాద్: తెలంగాణ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ 105 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్బంగా టీ టీడీపీ నేతలతో చంద్రబాబు లేక్ వ్యూ అతిధి గృహంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తో కలసి వెళ్లాల్సి వస్తే ఎన్ని అసెంబ్లీ సీట్లు కోరాలన్న దానిపై పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. లోక్ సభ ఎన్నికలు ఇప్పుడు జరగవు కాబట్టి లోక్ సభ స్థానాలను పక్కన పెట్టి పార్టీకి కేటాయించాల్సిన స్థానాల జాబితాను రూపొందించాలని టీటీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. టీజేఎస్, సీపీఐ పార్టీల గురించి కూడా ఈ సందర్బంగా చర్చికువచ్చినట్టు సమాచారం. టీడీపీకి 20 స్థానాల్లో 35 శాతం ఓట్లు వస్తాయని ఈ సందర్బంగా చంద్రబాబుకి టీ టీడీపీ నేతలు తెలిపినట్టు సమాచారం.