యూ టర్న్ తీసుకున్న జ‌గ్గూభాయ్

SMTV Desk 2018-09-08 13:55:40  Jagapathi babu, Jagapathi babu as hero, multistarrer

మోస్ట్ హ్యాండ్సమ్ హీరో జగపతి బాబు పేరు చెప్పగానే అందరికీ ఓ సాఫ్ట్ హీరో ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా ట‌ర్న్ తీసుకొని ప్ర‌స్తుతం మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయ్యారు.ఇటీవల పటేల్‌ సర్‌ సినిమాలో హీరోగా నటించిన జగ్గుభాయ్‌ త్వరలో ఓ బహుభాషా చిత్రంలో హీరోగా నటించనున్నాడట. కొత్త దర్శకుడు అన‍్బరసన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్‌, జాకీష్రాఫ్‌లు కూడా హీరోలుగా నటిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వినాయ‌క చ‌వితి రోజున దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.