విద్యార్థి, నిరుద్యోగ ఆవేదన సభ ఉద్రిక్తం

SMTV Desk 2018-09-07 16:06:51  JaggaReddy, Congress, Sangareddy

* పోలీసుల అదుపులో జగ్గారెడ్డి సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎవరి ప్రయత్నాల్లో వారే ఉన్నారు. తమకు కలిసి వచ్చే అంశాలపై ద్రుష్టి సారిస్తున్నారు. మొదటి నుండి తన ప్రత్యేకతను చాటే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలో విద్యార్థి, నిరుద్యోగ ఆవేదన సభను నిర్వహించారు. దీంతో అక్కడికి విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భారీగా చేరుకున్న విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వారిని అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ తోపులాటలో జగ్గారెడ్డి కింద పడిపోయారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డితో పాటు వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ జులుం నశించాలంటూ ఈ సందర్భంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ వాటిలో సగం కూడా భర్తి చేయలేదని, వారికీ రానున్న ఎన్నికల్లో విద్యార్థులే గుణపాఠం చెప్తారని అన్నారు.