నోటా ట్రైలర్ రిలీజ్‌

SMTV Desk 2018-09-06 17:59:44  NOTA trailer, vijay devarakonda,

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ నోటా ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే కోలీవుడ్ హీరో సూర్య తన ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సిఎంగా నటిస్తున్నాడు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఆడడం మొదలు పెట్టావో.. ఆపడం నీ చేతుల్లో ఉండదు. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని.. డైలాగ్స్ బాగా పేలాయి. సత్య రాజ్, నాజర్ సినిమాలో ప్రముఖ పాత్రల్లో కనిపిస్తున్నారని తెలుస్తుంది. తెలుగులో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఈ సినిమాతో తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు.