ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న బాల్క సుమన్

SMTV Desk 2018-09-06 16:01:26  Balka suman, TRS

* చెన్నూర్ నుండి పోటీ. * సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలుకు టికెట్ నిరాకరించిన కేసీఆర్. హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బాల్క సుమన్ గతంలో టీఆర్ఎస్ తరపున లోక్ సభలో అడుగుపెట్టారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. మంత్రి కేటీఆర్ ఆశీస్సులు కూడా బాల్క సుమన్ కు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి విడత జాబితాలో బాల్క సుమన్ పేరు కూడా ఉంది. చెన్నూర్ అభ్యర్థిగా బాల్క సుమన్ పేరును ప్రకటించారు.