కాసేపట్లో తెరాస అభ్యర్థుల ప్రకటన

SMTV Desk 2018-09-06 14:40:26  CM KCR, TRS

హైదరాబాద్‌:ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ రద్దుకు గల కారణాలను కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. ఇక పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌కు అందజేశారు. అనంతరం ఆయన మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగానే తెరాస అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత తెరాస అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటించనున్నారు.