హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా..?

SMTV Desk 2018-09-06 11:53:46  Sukumar, telugu Heroine Auctions,

మీరు తెలుగమ్మాయా..? హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా..? మీ వయసు 18-24మధ్య ఉందా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ హీరోయిన్ కోసం పిలుపునిచ్చింది. హీరోయిన్ అవ్వాలనుకుంటే మీ ఫొటో, డెమో రీల్స్, ఇంట్రో వీడియోలు Sukkumythri@Gmail.Comకి పంపండి. ఇక ఈ చిత్రానికి టాప్ దర్శకుడు సుకుమార్ కథను అందిస్తుండగా.. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంకెందుకు ఆలస్యం హీరోయిన్ కావాలనుకునే వారు తొందరగా ఈ అవకాశాన్ని ట్రై చేసుకోండి.