ఆధార్ కార్డు లేదని అడ్మిషన్ నిరాకరించడం చట్టవిరుద్ధం

SMTV Desk 2018-09-05 17:01:24  Uidai new Sercular. all states cheief Secretary, School Admissions

* పాఠశాలలు ఒత్తిడి చేయడంతో పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. * ప్రత్యామ్నాయ పత్రాలను తీసుకోండి * రాష్ట్రాల సీఎస్ లకు యూఐడీఏఐ సర్క్యులర్ ఢిల్లి : ఆధార్ కార్డు లేదనే కారణంతో పాఠశాలల్లో పిల్లల అడ్మిషన్ ను నిరాకరించడం చట్టవిరుద్ధమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఆధార్ కు ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాలను చూసూకోవాలిని రాష్ట్రాల సీఎస్ లకు సర్క్యులర్ జారీ చేసింది. అంతేకాక స్థానికంగా ఉండే బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఆధార్ కార్డుల కోసం ఎన్ రోల్ మెంట్ చేయించాలని సూచించింది. ఇటీవలి కాలంలో దేశంలో కొన్ని పాఠశాలలు ఆధార్ లేదన్న కారణంతో విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని వెల్లడించింది.