నోటా స్నీక్‌పీక్‌ : రౌడీ- పొలిటీషియన్ -లీడర్

SMTV Desk 2018-09-05 16:48:00  NOTA sneakpeak, Vijay devarakonda,

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ నోటా. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్‌ల తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్‌ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. విజయ్ దేవరకొండ మరోసారి విభిన్నకథా చిత్రంలో నటించనున్నారనే విషయం స్పష్టమవుతున్నది. తాజాగా విడుదలైన నోటా చిత్రం టీజర్‌లో విజయ్ పాత్రలోని వేరియేషన్స్‌ దిమ్మతిరిగేలా అనిపిస్తున్నాయి. టీజర్ (స్నీక్ పీక్) అమాంతం అంచనాలు పెంచేసింది. కంటెంట్‌తోపాటు సినిమా క్యాన్వాస్‌ను హైరేంజ్‌లో చూపించబోతున్నారని నోటా చెప్పకనే చెప్పింది టీజర్‌లో విజయ్‌ పబ్‌లో ఎంజాయ్‌ చేసే కుర్రాడిగా తరువాత ఓ రాజకీయనేతగా రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించాడు. ఈ నెల 6 సాయంత్రం 4 గంటలకు అఫీషియల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్‌ 4న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.