పార్లమెంట్ హౌస్ లో ముగిసిన పోలింగ్

SMTV Desk 2017-07-17 18:29:30  delhi, parlamenthouse, poling , president

న్యూఢిల్లీ, జూలై 17 : భారత దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఢిల్లీ పార్లమెంట్‌ హౌస్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో ఎంపీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ అగ్రనేత మురళీమనోహర్‌ జోషి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార, విపక్ష ఎంపీలు కూడా పార్లమెంట్‌ హౌస్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే పలువురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పార్లమెంట్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా 24న ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది.