అసెంబ్లీ రద్దు విషయంపై స్పష్టతను ఇచ్చిన కేటీఆర్

SMTV Desk 2018-09-05 15:31:28  Minister KTR, TRS, pRE ELECTIONS

* శుక్రవారం కల్లా మీరు మాజీలైపోతారు... ఎమ్మెల్యేతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలు తమ అభ్యర్డులను ప్రకటించే పనిలో పడ్డాయి. కేటీఆర్ తో నిన్న సాయంత్రం టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కాసేపు ఆయనతో ముచ్చటించిన తర్వాత మళ్లీ శుక్రవారం నాడు కలుస్తామంటూ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు చెప్పారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ, శుక్రవారం కల్లా మీరు మాజీ ఎమ్మెల్యేలు అయిపోతారని చెప్పారు. రేపు క్యాబినెట్ భేటీ నేపథ్యంలో ఇలాంటి వాక్యాలు చేయడంతో ముందస్తు ఖాయమనే అభిప్రాయం అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలకు అర్థమైంది. రేపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.