ఆ ఫ్లైట్‌లో ప్రయాణించొద్దు : ఈషా రెబ్బా

SMTV Desk 2018-09-05 13:56:36  esha rebba, Indigo.

ఎన్టీఆర్ సరసన అరవింద సమేత లో రెండో హీరోయిన్ గా నటిస్తున్న ఈషా రెబ్బా..మీరు ఎప్పుడూ ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించొద్దు.. ఇండిగోని అవాయిడ్ చేయండి అని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఈమె చాలా సార్లు ఈ ఫ్లైట్‌తో ఇబ్బంది పడిందట. ఇక విసుగొచ్చి ఈ స్టేట్‌మెంట్ ఇస్తున్నాని తెలిపింది.ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై ఈషా రెబ్బా ఈ మేరకు స్పందించింది. ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ, ‘‘ఇండిగో కారణంగా నేను విమానం మిస్ కావడం ఈ వారంలో ఇది రెండోసారి. ఇదంతా కేవలం ఇండిగో ఉద్యోగుల పొగరు కారణంగానే జరిగింది. వాళ్లు నన్ను ‘ఒక్క నిమిషం ఆగండి’.. ‘10 నిమిషాలు ఆగండి’ అంటూ వెయిట్ చేయించారు. చివరికి నన్నే ‘నువ్వు 5 నిమిషాలు లేట్ గా వచ్చావు’ అంటూ దబాయించారు’’ అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ని చూసిన ఈషారెబ్బ ‘‘మీరు చెప్పింది నిజం. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్‌నే ఇండిగో కారణంగా చాలా సార్లు ఫేస్ చేశాను. దీంతో నేను ఇండిగో ఫ్లైట్‌లో ఎప్పుడూ ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నాను. వారి రూల్స్‌ని సెట్ చేసుకునే వారు ఎవరూ ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించవద్దని నేను ప్రతి ఒక్కరినీ అర్థిస్తున్నా’’ అని రీ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.