ట్రెండ్‌ అవుతున్న మోహన్‌బాబు డైలాగ్‌ ‘ఫసక్‌’

SMTV Desk 2018-09-04 12:40:36  Mohan Babu fasak, Mohan Babu, fasak

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు రూటే స‌ప‌రేటు. ఆయ‌న మాట‌ల్లో గాంభీర్యం, డైలాగులకు అనుగుణంగా హావభావాలు , యాక్టింగ్ లో అదరగొట్టడం మోహ‌న్ బాబు సొంతం. ‘భగవంతుడు నాకు స్టీరియో ఫోనిక్ సౌండ్ ఉన్న వాయిస్ ఇచ్చాడు.. అది సిలోన్ బ్యాండ్ లెవెల్లో మోగుతుంది’ అంటూ ‘బ్రహ్మ’లో ఆయన చెప్పిన డైలాగ్‌ అక్షర సత్యం. ఏ డైలాగ్‌ను ఎక్కడ విరవాలో.. ఎక్కడ సాగదీయాలో ఆయనకు తెలిసినంతంగా మరో నటుడికి తెలీదంటే అతిశయోక్తి కాదు.విభిన్న పాత్ర‌లు పోషించిన మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల ‘ఇండియా టుడే’ టెలివిజన్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన డైలాగ్‌లు చెప్పే విధానం గురించి తనదైన స్టైల్‌లో చెప్పారు. మోహన్‌బాబు నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ ‘ఫసక్‌’ అనే మాటను వాడారు. ఇప్పుడు ఆ మాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.