మహానాడు లో పెరిగిన రద్దీ

SMTV Desk 2017-05-29 19:13:36  chadrababu naidu,mahanadu

విశాఖపట్నం, మే 29 : విశాఖపట్నం లో జరుగుతున్న మహానాడు సభలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ప్రజలు దాన్ని లెక్క చేయకుండా రెండు రోజుల నుంచి కొనసాగుతున్న ప్రసంగాలు, ఆటపాటలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆఖరి రోజు ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయని తెలుసు కోవడానికి కార్యకర్తలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. దీనితో మూడవ రోజు మహానాడు ఎలా ఉండబోతుందో అని తెలుసుకోవడానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.