మల్లి భగ్గు మన్న పెట్రోల్ ధరలు

SMTV Desk 2018-09-03 13:55:36  Petrol, Diesel rates,

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ముంబై, చెన్నై నగరాల్లో డీజిల్ ధర ఇవాళ మరో 42 పైసలు పెరిగింది.రూ.80 కి పైగా పెట్రోలు చేరిన‌ప్ప‌టి నుంచి త‌గ్గే సూచ‌న‌లే లేకుండా పైపైకే పోతున్న‌ది. ఇంధ‌న ధ‌ర‌ల‌తో సామాన్య‌,మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుత‌న్నారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నిర్ణయించే చమురు ధరల పెరుగుదల పరంపర తీవ్రతరమైంది. దేశరాజధానిలో పెట్రోల్‌ ధర తొలిసారిగా 79మార్క్‌ను దాటింది. సోమవారం నాటి రోజువారీ సవరణల ప్రకారం.. దిల్లీలో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర 31 పైసలు పెరిగి రూ. 79.15గా ఉంది. ముంబయిలో రూ. 86.56గా ఉంది. భారత్‌లో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్‌ ధర ఇంత అధిక ధర పలకలేదు. ఇక కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 82.06, చెన్నైలో రూ. 82.24గా ఉంది. డీజిల్‌ ధర కూడా మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగింది. సోమవారం దిల్లీలో లీటర్ డీజిల్ ధర 39 పైసలు పెరిగి రూ. 71.15గా ఉండగా.. ముంబయిలో రూ. 75.54, చెన్నైలో రూ. 75.19, కోల్‌కతాలో రూ. 74గా ఉంది.