హ్యాపీ బర్త్‌డే కళ్యాణ్ సార్: విజయ్ దేవరకొండ

SMTV Desk 2018-09-03 13:48:56  Happy Birthday, Vijay Devarakonda

ఇటీవలే గీత గోవిందం సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్న హీరో విజయ్ దేవరకొండ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఓ కీలక ప్రకటన చేశాడు. అయితే విజయ్ చేసిన ఈ ప్రకటన ఒక్కసారిగా అతని ఫ్యాన్స్‌ని తికమకలో పడేసింది. ట్విట్టర్ వేదికగా విజయ్ ‘‘రెండు ముఖ్యమైన ప్రకటనలు.. 1) హ్యాపీ బర్త్‌డే కళ్యాణ్ సార్.. 2) రేపటి నుంచి నేను ప్రచారం ప్రారంభిస్తున్నాను’’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు, విజయ్ ఫ్యాన్స్.. అతను దేనికి ప్రచారం చేస్తాడా అని సందిగ్ధంలో పడిపోయారు. కొందరేమో జనసేన పార్టీకి అని అంటుంటే.. మరికొందరు మాత్రం విజయ్ కొత్త సినిమా ‘నోటా’ కోసం అని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విజయ్ దేనికి సంబంధించిన ప్రచారం ప్రారంభిస్తాడో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే మరీ.