రాష్ట్రపతి ఎన్నికకు ఏపీలో తొలి ఓటరుగా సీఎం

SMTV Desk 2017-07-17 17:44:24  ap cm chadrababu, president election, amaravathi

అమరావతి, జూలై 17 : దేశ రాష్ట్రపతి ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ రాజధానైన అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరిగా ఉదయం పదిగంటలకు తొలి ఓటు వేశారు. ఆ తరువాత ఓటును సభాపతి కోడెల శివప్రసాద్ వేశారు. నిర్ణీత గడువు కంటే ముందుగానే నూరుశాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత తెదేపా, వైకపాలు విడివిడిగా తమ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా వెళ్లి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఓటింగ్‌ ప్రారంభమైన గంటకే ఒకరిద్దరు మినహా తెదేపా ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తరువాత వైకాపా ఎమ్మెల్యే ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనగా అది కూడా మధ్యాహ్నానికి పూర్తయింది. మిగిలిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు రెండు గంటలకల్లా తమ ఓట్లు వినియోగించుకోవడంతో ఓటింగ్‌ ప్రక్రియ ముగిసినట్లు రిటర్నింగ్‌ అధికారి స‌త్య‌నారాయ‌ణ వెల్లడించారు.