పవన్‌కి చిరంజీవి శుభాకాంక్షలు

SMTV Desk 2018-09-02 16:32:45  pawan Kalyan, Chiranjeevi,

ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, సహా నటులు, రాజకీయ నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి కూడ తన ప్రియమైన తమ్ముడికి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘కళ్యాణ్ బాబు నువ్వు అందుబాటులో లేవని తెలిసింది. కలవాలని అనుకొని విరమించాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ హనుమాన్ నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. – ఆశీస్సులతో అన్నయ్య చిరంజీవి’ అని మెగాస్టార్ తన తమ్ముడికి బర్త్ డే విషెస్ తెలిపారు.