జనసేనాని పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షలతో పోటెత్తుతోంది. టాలీవుడ్ సెలబ్రిటీలంతా జనసేనానికి పోటీపడి విష్ చేస్తున్నారు. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ నిత్యం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.