సుమంత్ VS కింగ్ నాగార్జున

SMTV Desk 2018-09-02 15:28:17  Sumanth, Nagarjuna,

కింగ్ నాగార్జునతో మేనల్లుడు సుమంత్ ఢీ కొడుతున్నాడని తెలుస్తుంది. మళ్లీ రావా సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన సుమంత్ ప్రస్తుతం అనీల్ శ్రీకంఠం డైరక్షన్ లో ఇదం జగత్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇదే డేట్ కు కింగ్ నాగార్జున, నాని మల్టీస్టారర్ మూవీ దేవదాస్ రిలీజ్ అనుకున్నారు. రిలీజ్ విషయంలో నాగార్జున, సుమంత్ సినిమాలు క్లాష్ అయ్యేలా ఉన్నాయి. అయితే ఈ పోటీకి ఇద్దరు సై అంటే సై అనేట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. నాగార్జున, సుమంత్ లు పైకి గొడవలేం లేవన్నట్టు కనిపిస్తున్నా సినిమాల ఫైట్ కు సిద్ధమవడం వారి మధ్య గొడవలను బయట పెడుతున్నాయని అంటున్నారు. నాగ్, నానిల కాంబో సినిమా కాబట్టి సుమంత్ మరోసారి ఇదం జగత్ రిలీజ్ విషయంలో ఆలోచిస్తే మంచిది.