కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న నయనతార సినిమా

SMTV Desk 2018-09-02 15:19:16  Nayanatara, kolamala kokila

ప్రముఖ నటి నయనతార తమిళంలో నటించిన ‘కొలమావు కోకిల’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఈ నెల 17న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో దీన్ని తెలుగులోనూ విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఇక ఈ చిత్రం 15రోజులకుగాను చెన్నై లో రూ. 4.53కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకొని బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజుతో అక్కడ 5కొట్ల క్లబ్ లో చేరనుంది ఈ చిత్రం. ఇక తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటివరకు ఈచిత్రం రూ. 23.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి కొత్త రికార్డు సృష్టించింది. సౌత్ లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో ఈ తరహా కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రం ‘కోకో కోకిల’ పేరుతో ఆగస్టు 31న తెలుగులో విడుదలైయి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది