శశికళకు అనారోగ్యం

SMTV Desk 2018-09-01 11:08:59  VK Shashikala, Banagalore, AIDMK

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే. శశికళ ఆగస్టు 31వ తేదీ శుక్రవారం అనారోగ్యానికి గురైనారని వెలుగు చూసింది. ఆమె మధుమేహం, రక్తపోటు సమస్య అదుపు తప్పింది. గురువారం రాత్రి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గుర్తించిన అధికారులు కారాగారంలోని వైద్యులతో చికిత్స చేయించారు. శుక్రవారం సాయంత్రానికి సమస్య కొంత అదుపులోకి వచ్చింది. మరోమారు సమస్య తిరగబెడితే నగరంలోని విక్టోరియా వైద్యశాలకు తరలించాలని నిర్ణయించినట్లు సంబంధిత వైద్యులు తెలిపారు.కొంత కాలం క్రితం వీకే. శశికళ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఆసుపత్రిలో చికిత్స చేశారు. శశికళ త్వరగా కోలుకోకుంటే వేరే ఆసుపత్రికి ఆమెను తరలించడానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.