రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్

SMTV Desk 2018-08-31 15:51:21  Surender reddy, Allu Arjun,

స్టార్ అండ్ కమర్షియల్ దర్శకులలో ఒకరైన సురేందర్ రెడ్డి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథతో వస్తున్న ఈ సినిమాను సూరి చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ మెగా హీరోతోనే సినిమా కన్ఫాం చేస్తున్నాడట. చరణ్, బన్నిలలో సూరి డైరక్షన్ లో నటించే హీరో ఎవరంటే మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్ కాబోతుందని టాక్. సైరా సినిమా పూర్తి కాగానే బన్నితో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నాడు డైరక్టర్ సురేందర్ రెడ్డి. ఇప్పటికే బన్నికి ఓ లైన్ చెప్పడం దానికి బన్ని ఓకే చెప్పడం జరిగిందట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రేసుగుర్రం సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే. ఆ అంచలాకు తగినట్టుగా మరోసారి ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరణ్, చిరు, బన్ని ఇలా వరుసగా ముగ్గురు మెగా హీరోలతో ఆఫర్ కొట్టేసి దర్శకుడిగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు సురేందర్ రెడ్డి.