హిజ్బుల్ ముజాహిదిన్ చీఫ్ సలావుద్దీన్ కొడుకు అరెస్ట్

SMTV Desk 2018-08-30 12:29:10  sayyad salauuddin, arrested

ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదిన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ తనయుడు సయ్యద్ షకీల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు నిధుల సేకరణ, సరఫరా చేస్తున్నాడన్న అభియోగంపై షకీల్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. గ‌తంలో ష‌కీల్‌ను అనేక సార్లు ఇదే కేసులో ప్ర‌శ్నించారు, కానీ జూన్ 30వ తేదీ త‌ర్వాత అత‌ను తాజా స‌మ‌న్ల‌కు స్పందించ‌లేదు. దీంతో అత‌న్ని అరెస్టు చేశారు. శ్రీన‌గ‌ర్‌లోని హాస్ప‌ట‌ల్‌లో ష‌కీల్ మెడిక‌ల్ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్నాడు.