వెరైటీ ట్వీట్ తో కింగ్ నాగార్జునకు బర్త్ డే విశేష్ తెలిపిన హీరోయిన్...

SMTV Desk 2018-08-29 23:38:45  tollywood,nagarjuna,nani,rashmika,devadas,actress

నేడు 29 సెప్టెంబర్ న నాగార్జున బర్త్ డే ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. నాగార్జున మరియు నాని కలిసి నటిస్తున్న‘దేవదాస్’చిత్రంలో ఈ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు ఓ వెరైటీ ట్వీట్ చేసింది. ‘నాగార్జున సార్.. మీ అభిమానిగా, బాడీ గార్డుగా గర్వంగా ఉన్నాను. మీ జీవితాన్ని కింగ్ సైజ్ లో జీవించండి. మీకు అన్ని వైపుల నుంచి నేను భద్రత కల్పిస్తా’ అని అందాల భామ రష్మిక ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా‘దేవదాస్’ సెట్ లో నాగార్జునతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. చిత్రం వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.