హరికృష్ణ నా సొంత తమ్ముడి కంటే ఎక్కువ :కృష్ణంరాజు

SMTV Desk 2018-08-29 21:48:03  krishnamraju,harikrishna,accident,haiderabad,mehadipatnam

మెహిదీపట్నంలోని నివాసంలో నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి సీనియర్ నటుడు కృష్ణంరాజు నివాళులర్పించారు. హరికృష్ణ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. హరికృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కంటతడిపెట్టారు. ఆయన తనకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ అని అన్నారు. ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలనే మనస్తత్వం అతనిదని, సున్నిత మనస్తత్వం కలిగిన హరికృష్ణ మరణం తనకు చెప్పలేని బాధ కలిగిస్తోందని కృష్ణంరాజు కన్నీటి పర్యంతమయ్యారు. హరిక‌ృష్ణ తనను ‘అన్నయ్యా’ అని పిలిచేవాడని,అలాంటి మంచి మనసు గల సోదరుని కి ఈరోజు ఇలా జరగడం దురద్రుష్టకరం అంటూ ఆయన భవోద్వేగానికి గురయ్యారు.